వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. నూతనంగా నియమితులైన వరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ యం. వెంకటరమణ కమిషనర్ ను కలిసి పుష్పాగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన మరింత పెంచాలని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డిఎస్పీ కె. గిరికుమార్ మహబూబ్ నగర్ కు బదిలీ అయ్యారు.