ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులో 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిపై ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి, ముగ్గురు మహిళలు అడ్డుపడుతున్నారు. గడ్డపారలతో పిల్లర్లను కూల్చివేస్తూ, సిమెంట్ తొలగిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించారు. ఇంటి పన్ను చెల్లిస్తున్నా, అన్ని ఆధారాలున్నా తమకు న్యాయం జరగడం లేదని, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయారు. ఈ వీడియో చూస్తున్నవారిని న్యాయం చేయాలని వేడుకున్నారు.