వరంగల్‌: కాళేశ్వరం వెళ్లొస్తుండగా బోల్తా పడిన కారు!

కాళేశ్వరం నుండి తిరిగి వస్తున్నప్పుడు బస్వాపూర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరంగల్‌కు చెందిన ఆరుగురు యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. పుష్కర స్నానాలు ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్