కాంగ్రేస్ పాలనలో వరంగల్ నగర అభివృద్ధి శూన్యం.. మాజీ ఎమ్మెల్యే

గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రభుత్వ పాలన ముగిసి, అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో, బిఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలిపారు. వరంగల్ బల్దియా అవినీతిమయం అయిందని, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి దూరంగా ఉండి గొప్పలు చెప్పుకుంటున్నారని, చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు అవినీతిలో కూరుకుపోయారని నరేందర్ ఆరోపించారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్