జల దిగ్బంధంలో వరంగల్ నగరం.. రాకపోకలు బంద్

భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. హనుమకొండను అనుసంధానించే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్-హనుమకొండ మధ్య రాకపోకలు స్తంభించాయి. హన్మకొండలోని ఊర చెరువు తెగడంతో పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించింది. అధికారులు ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ముంపు ప్రాంతాల వాసులను తరలిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు కరెంటు, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాలాలను టెంపుతూ వరద నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్