వరంగల్ లోని పేదల ఆసుపత్రి అయిన ఎంజీఎం లో పరిస్థితులు దారుణంగా ఉన్నవి. చుటూ పది జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆసుపత్రిలో ఎటు చూసిన నిర్లక్ష్యం కనిపిస్తోంది. గతంలో రోగులను ఎలుకలు కొరికిన సంఘటన విధితమే. అయితే తాజాగా కారిడార్ లో పెచ్చులు ఊడిపడ్డాయి. పైగా శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయడంలేదు. దీనితో ఆ చుట్టూ పక్కన దుర్గంధం వెదజల్లుతుంది. అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.