హనుమకొండ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిట్ట మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహ నిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలని, అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని ఆయన కోరారు.