గ్రేటర్ వరంగల్లోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇండ్ల పట్టాలు అందజేశారు. శనివారం 11, 29వ డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ధర్మకర్త ఓరుగంటి పూర్ణచందర్, స్థానిక డివిజన్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.