వరంగల్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం.. వైద్యురాలు ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హనుమకొండ హసన్‌పర్తిలో వైద్యురాలు ప్రత్యూష ఆత్మహత్య పాల్పడింది. భర్త డాక్టర్ అల్లాడి సృజన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివాహేతర సంబంధం విషయమై పలుమార్లు భార్య భర్తల మధ్య గొడవలు జరుగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్