కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (ఎంఈఎంయు) ట్రైన్ నంబర్ 67269) ఆదివారం నుంచి ప్రారంభమైంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది అన్నారు. మూడో లైన్ పనులు, మరమ్మత్తుల కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు అని తెలిపారు.