మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, రూ. 20 లక్షల రివార్డు కలిగిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్, తన భార్య పూనంతో కలిసి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు. అనారోగ్య కారణాలు, జార్ఖండ్ సరాండా అడవుల్లో పోలీసుల నిఘా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్ (ప్రస్తుత హన్మకొండ) జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి, 1980ల్లో నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితులై, 1996లో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమంలో కొనసాగారు.