వరంగల్‌: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆ నాడు వరంగల్‌ జిల్లాను 6 ముక్కలు చేయొద్దని నేను కేసీఆర్‌ను బతిమాలాను. వరంగల్‌ జిల్లాను ఆగమాగం చేశారు. పైకి వరంగల్‌ జిల్లా అని చెప్పుకోవడమే మిగిలింది. నాడు 36 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారు. ఎవరూ రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇవ్వలేదా? కేసీఆర్‌ వ్యవహారం నచ్చక నాయకత్వం బయటకొస్తున్నారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్