హనుమకొండ శివారులోని పెగడపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. సరోజన అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేసిహత్య చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. తద్వారా సరోజన సవతి కొడుకు జైపాల్ రెడ్డి ఆస్తి గొడవ నేపథ్యంలో పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.