వరంగల్ జిల్లా కేంద్రంలో బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీలు రాజకీయాలు చేయొద్దని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నేతలు ఉన్నారు.