వరంగల్: కొడుకు భూమి లాక్కున్నాడు.. వృద్ధ దంపతుల ఆవేదన

తమ పెద్ద కుమారుడు తమకు తెలియకుండా తమ పేరిట ఉన్న 1 ఎకరం 30 గుంటల భూమిని తన పేరుపై మార్చుకుని బెదిరిస్తున్నాడని వర్ధన్నపేటకు చెందిన వృద్ధ దంపతులు బొంత లక్ష్మమ్మ, సారయ్య కలెక్టర్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ భూమిని తిరిగి ఇప్పించి కొడుకు నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. భూమి తీసుకుని తమ బాగోగులు చూడట్లేదని, ఎమ్మార్వో, పోలీసులు పట్టించుకోవడం లేదని సోమవారం వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్