మొంథా తుపాను ధాటికి వరంగల్, హన్మకొండ జిల్లాలు ఇంకా కోలుకోలేదు. పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 8 మంది మృత్యువాత పడ్డారు. అనేకమంది ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.