మార్చి నెలాఖరుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. కాగా, వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందున్న రూ.50 కోట్ల టార్గెట్‌లో ఇంకా రూ.14 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.36 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. సిబ్బంది కొరతతో వసూళ్లు మందగించినట్లు తెలుస్తోంది. పాత, మొండి బకాయిలపై దృష్టి పెట్టిన అధికారులు, సీసీఐ, ఐకేపీ ద్వారా వచ్చే ఆదాయంతో లక్ష్యాన్ని చేరుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.