వరంగల్ శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ గోవిందరాజస్వామి దేవాలయ ఇన్‌చార్జ్ ఈవో గా బాధ్యతలు తీసుకుంటున్న కిషన్ రావు శుక్రవారం దేవాలయాన్ని సందర్శించారు. అర్చకులు వరయోగుల శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో వరయోగుల వేణుమాధవ్ స్వామి, జగన్నాథం వేణు స్వామి, అరుణ్ కుమార్ స్వామి, లక్ష్మణ స్వామి సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ పాల్గొన్నారు.