గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, 27వ డివిజన్ ప్రజలు తమ డివిజన్లో 30 ఏళ్ల తర్వాత రోడ్డు వేయడానికి ఇంటి ముందున్న గద్దెలను కూలగొట్టి, సగం రోడ్డు వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ కౌన్సిల్ సమావేశ హాల్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు. నెల రోజుల క్రితం రోడ్డు మంజూరు అయిందని, స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించి సగం రోడ్డు వేశారని, అయితే బాగా ఉన్న రోడ్డును మళ్లీ ఎందుకు వేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరగా, పోలీసులు ప్రజలను అడ్డుకొని సర్ది చెప్పారు.