వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని వడ్డేపల్లి ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. 60వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి తో కలిసి శంకుస్థాపన చేశారు. పదేళ్లలో పడకేసిన పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు.