హనుమకొండ: ప్రజా సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉంటాం: కొండా మురళి

హనుమకొండ, రాంనగర్ లోని కొండా దంపతుల నివాసంలో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ప్రజల నుంచి విజ్ఞప్తులను, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రజల సమస్యలను తీర్చడానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్