వరంగల్: డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం: కార్పొరేటర్

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు కార్పొరేటర్ల టికెట్ల కోసం తాము డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని గురువారం 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ అన్నారు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. అజీజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు కోసం బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్