భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి..పల్లపు మధు

ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలో జనసేన నాయకుడు పల్లపు మధు ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగాలను, యువతలో ఆయన నింపిన దేశభక్తి స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు. భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పల్లపు మధు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕