జీ రాంజీ పథకం రద్దు చేయాలి: మామిడాల బిక్షపతి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని, ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ పనిదినాలు కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) అధ్యక్షులు మామిడాల బిక్షపతి డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 6 నుండి 24వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్