కడారి గూడెం గ్రామంలో 3వ రోజు బొడ్డెమ్మ ఉత్సవాలు

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యకంగా నిలిచే బొడ్డెమ్మ వేడుకలు కడారిగూడెం గ్రామంలో శనివారం రాత్రి3వ రోజు ఘనంగా ఆడి పాడారు. గ్రామంలో మహిళలు, బాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి బొడ్డెమ్మను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బొడ్డెమ్మ చుట్టూ సాంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕