కాజీపేటలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 41కి పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్  వెంకన్న తెలిపారు. ఆదివారం చేపట్టిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 37 మందితో పాటు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి కోర్టు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేదంటే జరిమానా తప్పదని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్