హనమకొండ జిల్లా ధర్మసాగర్ పాఠశాల విద్యార్థిని మాచర్ల రేణుక పదవ తరగతి పరీక్షల్లో 432 మార్కులు సాధించి అందరి మన్ననలు పొందింది. కాజిపేటలో జరిగిన కార్యక్రమంలో డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసునూరి రమేష్ బుధవారం ఆమెను శాలువాతో సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు.