పున్నెల క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన తల్లి, కొడుకు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడుకు పిన్నింటి అనిల్ లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి బైక్ పై నుంచి పక్కకు పడటంతో ప్రమాదం నుంచి బయటపడింది. లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న కొడుకు మృతిని కళ్లారా చూసిన తల్లి గుండెలు పగిలేలా రోదించింది.