వర్ధన్నపేటలో పర్వతగిరి మండలం కల్లెడ పిఎసిఎస్ చైర్మన్ గా పిన్నింటి అనిల్ రావ్, చౌటపెల్లి పిఎసిఎస్ చైర్మన్ గా అత్తి కుమారస్వామి, 24 మంది డైరెక్టర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అనిల్ రావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, తనపై నమ్మకముంచి ఈ పదవిని అప్పగించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గం రైతులకు మెరుగైన సేవలను అందించి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.