ఆయిల్పామ్ తోట తగులబెట్టిన వ్యక్తిపై కేసు

సంగెం మండలంలోని తీగరాజుపల్లిలో సోలగూడి బాబురావుకు చెందిన 5 ఎకరాల ఆయిల్పామ్ తోట అగ్నిప్రమాదంలో కాలిపోయింది. ఈ నెల 14న పక్కనే ఉన్న ఏనుగల్లుకు చెందిన కానుగంటి సంపత్ తన మక్కజొన్న చేనుకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించి బాబురావు తోటలోకి చేరాయి. ఈ ఘటనలో బాబురావుకు సుమారు రూ. 40వేల నష్టం వాటిల్లింది. బాబురావు ఫిర్యాదు మేరకు సంపత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. రైతులు తమ చేనులకు నిప్పు పెట్టవద్దని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్