వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు గణనీయంగా పెరిగాయి. నాణ్యమైన రంగు గల మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా, వండర్ హాట్ రకం మిర్చికి క్రేజ్ పెరిగింది. నిన్న ₹36,000 ఉన్న ఈ రకం ధర ఈరోజు ₹37,100కు చేరింది. ఈ మిర్చిలోని ఘాటు, రంగు కారణంగా మసాలా కంపెనీల నుండి భారీ ఆర్డర్లు వస్తున్నాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.