బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తీవ్రతరం కావడంతో, గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హసన్పర్తి మండలం నాగారం చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది. గత రాత్రి నుండి రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలా జరిగితే చెరువు మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.