50 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి

పర్వతగిరి మండలంలోని పెద్ద తండా, ధూప తండా గ్రామాలలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున మొక్కజొన్న, పత్తి చేలు దెబ్బతిన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి మొక్కజొన్న చెలు నేలకొరిగాయి. మొక్కజొన్న 40 ఎకరాలు, పత్తి 50 ఎకరాలలో పంట మొత్తం తుడుచుపెట్టుకొని పోయింది. పెద్ద మొత్తంలో అప్పులు చేసి వ్యవసాయం చేస్తే భారీ వర్షాలకు నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్