దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. వర్ధన్నపేట పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో తూకంలో తేడాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్