ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులోని ప్రసిద్ధ గట్టమ్మ దేవాలయాన్ని ప్రముఖ సినీ నటుడు నాని దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రం 'ప్యారడైజ్' విజయవంతం కావడంతో, చిత్రయూనిట్ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలో గట్టమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నానిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. నటుడు సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నారు.