మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీజడ్పీటీసీ

మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ఇటీవల మరణించిన పలువురు మృతుల కుటుంబాలను సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు శుక్రవారం పరామర్శించారు. పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన జంగా ఎల్లమ్మ, కోటి మల్లమ్మ లు గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేడిశెట్టి రాములు శుక్రవారం వారి నివాసాలకు వెళ్లి, మృతుల భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయాలతో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, మనోనిబ్బరం కోల్పోకూడదని కోరారు.

సంబంధిత పోస్ట్