నేటినుంచి 509 రేషన్ షాపుల్లో.. ఒకేసారి 3 నెలల బియ్యం

బుధవారం నుంచి వరంగల్ జిల్లాలోని 509 రేషన్ షాపుల్లో మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 509 షాపులకు బియ్యం చేరాయి. మూడు నెలలకు గాను 16,782.804 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకి అధికారులు నిల్వలు సిద్ధం చేశారు. రేషన్ షాపులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్