ఆగస్టు 1న హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా, మడికొండ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ జయరాజు ప్రజాదరణ పొందిన ఐదుగురు ఉత్తమ ఆటో డ్రైవర్లను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. డ్రైవర్లు కస్టమర్లను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.