హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ కమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతులను శుక్రవారం ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి తదితరులు పరిశీలించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లోని హకీంపేటలో మాత్రమే ఉన్నదని అంతే హంగులతో కూడిన రెండో క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్న క్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.