వర్ధన్నపేట నియోజకవర్గం కాకతీయ యూనివర్సిటీలో BRSV నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీట్ విచారణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ సాధింపులో భాగంగానే ఈ దుర్మార్గమైన విధానాలను పాటిస్తున్నారని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే నోటీసులను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజ్జి విష్ణు, కోరాపెల్లి రాజేష్, రాము రాజేష్, అనిల్, వేణు, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.