వరంగల్ రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పర్వతగిరి మండల ముఖ్య నాయకులతో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లోని హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని వారు తెలిపారు.