ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం ఐనవోలు కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి బాబు అనే యువకుడు బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐనవోలు ఎస్సై కొంక అశోక్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.