మేడారం: సమ్మక్క తల్లికి ఘనస్వాగతం, మంత్రుల పర్యటన

ములుగు నియోజకవర్గంలోని మేడారంలో సమ్మక్క తల్లికి ఘనస్వాగతం లభించింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మేడారం జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి వనం (చిలకలగుట్ట) వీడి జనంలోకి ఆగమనం ప్రారంభమైంది. సమ్మక్క తల్లికి గౌరవసూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు సమ్మక్క తల్లి గద్దెలపైకి బయలుదేరింది. భక్తుల జయజయధ్వానాల మధ్య ఈ ఘట్టం చోటుచేసుకుంది. మాచర్ల సారంగపాణి అలియాస్ ఎమ్మెస్ గౌడ్ సమ్మక్క సారక్క జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్