మేడారం జాతర: కోటిన్నర భక్తుల భక్తి పారవశ్యం

తెలంగాణ మహా కుంభమేళగా పేరొందిన మేడారం వనదేవతల జాతరలో భక్తుల సందడి నెలకొంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. శుక్రవారం నిండు పౌర్ణమి నాడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు తన్మయత్వంతో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు కోటిన్నర నుండి రెండు కోట్ల మంది భక్తులు ఈ జాతరలో పాల్గొని, తమ కష్టసుఖాలను అమ్మవార్లకు చెప్పుకుని, పిల్లపాపలను, గొడ్డుగోదలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. మేడారం, ములుగు నియోజకవర్గం, తాడువాయిలో ఈ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్