గద్దర్ వేషధారణలో మెరిసిన ఎమ్మెల్యే నాగరాజు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుగుతున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆయన శ్రీకాంతాచారి, పోలీస్ క్రిష్ణయ్య త్యాగాలను గుర్తుచేస్తూ భావోద్వేగ ప్రదర్శన చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పాత్రను ప్రతిబింబిస్తూ “పొడుస్తున్న పొద్దు” పాటకు అనుగుణంగా ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్