పర్వతగిరి: రాజన్న వైన్స్ షాపులో దొంగతనం

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలోని రాజన్న వైన్స్ షాపులో దొంగతనానికి పాల్పడిన ఏడుగురు నేరస్తుల ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మేజర్లు, నలుగురు మైనర్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు వీరి వద్ద నుంచి రూ 20వేల నగదు, 04 సెల్ ఫోన్లు, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్