వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను బేగంపేట్ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుకు అధికారికంగా అప్పగించారు. మామునూరు విమానాశ్రయాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు.