పర్వతగిరి మండలంలోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్, సోమవారం ఉదయం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ఆయనను నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.