పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ మోసం చేస్తుందని రాష్ట్రపతికి బిల్లు పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతున్నారని శుక్రవారం ఆరోపించారు. బీసీలకు 42% కోటపై ఆర్డినెన్స్ కు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం చట్టపరంగా వీలుకాదని తెలిసి సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.