పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి గుగులోత్ సందీప్ జిల్లా స్థాయి అండర్-18 అథ్లెటిక్స్ పోటీల్లో 100మీ. పరుగు, లాంగ్ జంప్‌లో తొలి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆగష్టు 3, 4వ తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాల నుండి పదవ తరగతి విద్యార్థి సందిప్ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం అభినందనీయం అని అన్నారు.